కోర్టు చెబితేనే అర్థమవుతుందా?: వర్ల

రాష్ట్రంలో చట్టం-నేరం కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. పలు చోట్ల పోలీసుల వ్యవహారశైలి...

Updated : 14 Mar 2020 15:50 IST

అమరావతి: రాష్ట్రంలో చట్టం-నేరం కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. పలు చోట్ల పోలీసుల వ్యవహారశైలి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా మాచర్ల ఘటన చూశాక రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. మాచర్ల ఘటన దర్యాప్తులో అన్నీ తప్పటడుగులేనని ఆరోపించారు. నేరస్థుడికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే హత్యాయత్నం కేసు పెట్టలేదన్నారు.

మాచర్ల సీఐపై, తెనాలి ఘటనలో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని వర్ల డిమాండ్‌ చేశారు. పర్యటనకు వెళ్తున్నట్లు ముందుగానే చంద్రబాబు పోలీసులకు సమాచారమిచ్చారని స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. డీజీపీని కోర్టులో నిల్చొనే విధంగా చేసిన ఘనత కూడా ఆయనదేనని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాలన్నీ కోర్టు చెబితేనే అర్థమవుతుందా?అని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని