
Published : 16 Mar 2020 00:59 IST
ఎస్‌ఈసీ రాజీనామా చేయాలి:విజయసాయిరెడ్డి
విశాఖ: స్థానిక ఎన్నికల వాయిదాపై అధికారులతో సంప్రదించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ ఎలా నిర్ణయం తీసుకుంటారని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 243కె, 243 జడ్ ఏ ఆర్టికల్స్‌ను తుంగలో తొక్కారని.. ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. మునిగిపోతున్న తెదేపా నావను రక్షించాలనే స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఎస్‌ఈసీకి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags :