సీఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా ఉంది:అక్బరుద్దీన్‌

సీఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై

Updated : 16 Mar 2020 14:00 IST

హైదరాబాద్‌ : సీఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై అక్బరుద్దీన్‌ మాట్లాడారు. ‘ఈ చట్టం దేశాన్ని బలహీనపరిచే విధంగా ఉంది. ఈ చట్టం ఎస్సీ, ఎస్టీ బలహీనవర్గాలకు వ్యతిరేకంగా ఉంది. ఈ చట్టం వల్ల ఉత్తరప్రదేశ్‌లో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌ఆర్‌సీ కొత్త సమస్యను సృష్టిస్తోంది. పౌరుడు కాని వారికి పౌరసత్వం వస్తుంది. దేశ పౌరుడికి పౌరసత్వం పోతుంది. సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. మతాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టే తెరాసతో కలిసి ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం అందరినీ సమదృష్టితో చూస్తోంది. ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ నిర్ణయం కోట్లాది మంది ప్రజలను ఇబ్బందికి గురిచేస్తుంది’ అని అక్బరుద్దీన్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని