బడ్జెట్‌ సమావేశాలను వాయిదా వేయండి 

కరోనా వైరస్‌ వ్యాపి నేపధ్యంలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ పార్టీ నేత....

Published : 22 Mar 2020 01:44 IST

బెంగళూరు : కరోనా వైరస్‌ వ్యాపి నేపథ్యంలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు కరోనా వైరస్‌ నివారణపై సలహాలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాలు కొనసాగించడం సమంజసం కాదని శనివారం వరుస ట్వీట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాలతో వందలాది శాసనసభ్యులు, అధికారులు, జర్నలిస్టులు ఒకే ప్రాంగణంలో ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమవ్వాలి. సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని నేను కోరుతున్నాను. ప్రజలకు ఒకటి చెప్తూ ప్రభుత్వం మరొకటి చేయవద్దని కుమారస్వామి పేర్కొన్నారు. మార్చి2న ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31వరకు కొనసాగుతాయి. 

మరో ట్వీట్‌లో కుమారస్వామి ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. కరోనా నిర్మూలనలో సేవలందిస్తున్న వైద్య, ఇతర సిబ్బందిని అభినందిస్తూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు అయిదు నిమిషాలు చప్పట్లు కొట్టాలని ప్రజలను కోరారు. వైరస్‌ వ్యాప్తి నిర్మూలనకు పలు సూచనలు చేశారు. కరోనా నిర్మూలను రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నగదు తీసుకొనేందుకు ఏటీఎంల వద్దకు వచ్చేవారికి కరోనా నుంచి రక్షణగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని