రజనీ పోస్టును ట్విటర్‌ ఎందుకు డిలీట్‌ చేసిందంటే..

రజనీకాంత్‌ ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్లు అనుకుంటూ అభిమానులు ఫాలో అయిపోతుంటారు. అలాంటిది రజనీకాంత్‌ చేసిన ఓ ట్వీట్‌ను ట్విటర్‌ తొలగించిందంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది అందులోనూ ప్రజలకు మంచి జరిగే ట్వీటు.

Updated : 23 Mar 2020 01:30 IST

చెన్నై: రజనీకాంత్‌ ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్లు అనుకుంటూ అభిమానులు ఫాలో అయిపోతుంటారు. అలాంటిది రజనీకాంత్‌ చేసిన ఓ ట్వీట్‌ను ట్విటర్‌ తొలగించిందంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది అందులోనూ ప్రజలకు మంచి జరిగే ట్వీటు. కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘జనతా కర్ఫ్యూ’కు మద్దతుగా ప్రజలను ఉద్దేశించి రజనీకాంత్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఓ వీడియో రూపంలో తన భావాల్ని వినిపించాడు. అయితే ఆ వీడియో ఇప్పుడు ట్విటర్‌లో లేదు. అయితే దీనికి కారణం కొంతమంది నెటిజన్లే అని తెలుస్తోంది. ఆ వీడియోకు కొందరు నెగిటివ్‌ ఫీడ్ బ్యాక్‌ ఇవ్వడం వల్ల ట్విటర్‌ దాన్ని తొలగించిందని సమాచారం. ‘జనతా కర్ఫ్యూ’కి మద్దతుగా అందరూ ముందుకొస్తున్న వేళ ఇలాంటివి జరగడం ఇబ్బందికరమే.

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో ప్రజలంతా అందులో భాగస్వాములు కావాలని కోరుతూ రజనీ ఓ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ‘ప్రస్తుతం మన దేశంలో వైరస్‌ రెండో దశలో ఉంది. మూడో దశకు చేరకుండా ఉండాలంటే అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలి. 12-14 గంటలు ఇంట్లో ఉండడం వల్ల వైరస్‌ గాలిలో వ్యాప్తి చెందే అవకాశం తగ్గిపోతుంది. ఇటలీలో ఈ తరహా కర్ఫ్యూపై అలసత్వం వహించడం వల్లే పరిస్థితులు చేజారిపోయాయి. కాబట్టి మనందరం ఆదివారం ఇళ్లలోనే ఉందాం’ అంటూ ట్వీట్‌లో వీడియోలో రజనీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు