ఇంట్లో ఉందాం.. కరోనాను ఖతం చేద్దాం: హరీశ్‌రావు

ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా కుటుంబసభ్యులతో కలిసి తానూ ఇంట్లోనే ఉన్నానని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు

Updated : 12 Oct 2022 16:06 IST


 

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా కుటుంబసభ్యులతో కలిసి తానూ ఇంట్లోనే ఉన్నానని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఏం కాదనే ధోరణి వద్దు.. ఇలాంటి ధోరణి వల్లే  చైనా, ఇటలీ లాంటి దేశాలు ఎలా వణికి పోతున్నాయో చూస్తున్నాం. మనకు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం మన ఇంట్లోనే ఉందాం- మన కుటుంబాన్ని, మన రాష్టాన్ని, మన దేశాన్ని రక్షించుకుందాం. మన ఇంట్లో మనం ఉందాం.. కరోనాను ఖతం చేద్దాం’ అని హరీశ్‌రావు వీడియో సందేశం ఇచ్చారు.


 

 

 Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు