జనతా కర్ఫ్యూ:చప్పట్లు కొట్టిన కేసీఆర్‌,జగన్‌

కరోనా వైరస్‌ నిర్మూలనకు దేశవ్యాప్తంగా జాతి యావత్తూ  జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో ఉద్యమస్ఫూర్తితో

Updated : 23 Mar 2020 01:30 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నిర్మూలనకు దేశవ్యాప్తంగా జాతి యావత్తూ  జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో ఉద్యమస్ఫూర్తితో ఇది కొనసాగుతోంది. కరోనా వైరస్‌ నియంత్రణకు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది నిరాటంగా సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా ఈ సాయంత్రం 5 గంటలకు దేశ వ్యాప్తంగా ప్రజలంతా తమ ఇళ్లలోంచి బయటకు వచ్చి సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గంట కొట్టి మద్దతు ప్రకటించారు. ప్రజలు సైతం ఇళ్ల ముందు నిలుచుని వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని