నెల జీతం విరాళమిచ్చిన డిప్యూటీ సీఎం

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్థికంగానూ నష్టం జరుగుతోంది. ఈ క్రమంలో హరియాణా ఉప.....

Published : 24 Mar 2020 01:44 IST

చండీగఢ్‌ (హరియాణా): కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్థికంగానూ నష్టం జరుగుతోంది. ఈ క్రమంలో హరియాణా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలా తన నెల రోజుల జీతాన్ని కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక స్థోమత ఉన్న ఉద్యోగులు, స్నేహితులు తనతో పాటు చేయి కలిపి కరోనాను ఎదుర్కోవడంలో పాలుపంచుకోవాలని కోరారు. ఇదే సమయంలో పంజాబ్‌లోని విజిలెన్స్‌ బ్యూరో అధికారులు సైతం తమ ఒకరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. హరియాణాలో ఇప్పటికే 21మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఒకరు మరణించారు. కరోనా సోకిన వారిలో 14మంది విదేశాలకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని