Published : 26/03/2020 16:31 IST

రేపు ఏపీ కేబినెట్‌ భేటీ

అమరావతి: ఏపీ మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాలులో కేబినెట్‌ భేటీ జరగనుంది. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో సీఎం జగన్‌ సహా మంత్రులు సామాజిక దూరం పాటిస్తూ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

మూడు నెలల బడ్జెట్‌కు సంబంధించి  జూన్‌ 30 వరకు అవసరమైన నిధుల కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేబినెట్‌ సమావేశంలో ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేయనున్నారు. మంత్రివర్గం ఆమోదం అనంతరం ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ప్రభుత్వం పంపనుంది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తాత్కాలిక బడ్జెట్‌కు ఆమోదం పొందాలని ప్రభుత్వం తొలుత భావించింది. కరోనా ప్రభావంతో అసెంబ్లీ నిర్వహణ సాధ్యపడలేదు. దీంతో ఆర్డినెన్స్‌ తీసుకురావాలని నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పరిస్థితులపైనా కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని