వైద్యులకు భరోసా కల్పిస్తాం: తలసాని

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని హేయమైన చర్యగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అభివర్ణించారు. గురువారం గాంధీ ఆస్పత్రిని ఆయన సందర్శించి అక్కడ కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలు...

Published : 02 Apr 2020 19:59 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని హేయమైన చర్యగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అభివర్ణించారు. గురువారం గాంధీ ఆస్పత్రిని ఆయన సందర్శించి అక్కడ కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలు, దాడి ఘటనకు సంబంధించిన వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్యులపై ఎవరైనా దాడికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రస్తుత సమయంలో వైద్యులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మనకు వైద్యం అందిస్తున్నారని.. వైద్యులకు భరోసా కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా పికెట్‌ ఏర్పాటు చేశామన్నారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోని యాచకులను వేరే ప్రాంతాలకు తరలించనున్నట్లు చెప్పారు. దిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన మతపరమైన సమావేశానికి వెళ్లి రాష్ట్రానికి వచ్చిన వారిని దాదాపు గుర్తించామని మంత్రి తెలిపారు. ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ఆస్పత్రికి వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని