సైకిల్‌పై ఏలూరుకి ఎమ్మెల్యే..

రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని టీడీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు. కరోనా,

Updated : 06 Apr 2020 15:36 IST

రైతు సమస్యలపై కలెక్టర్‌కు విన్నవించేందుకు

పశ్చిమగోదావరి: రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని టీడీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా రైతుల సమస్యలపై పాలకొల్లు నుంచి ఏలూరు వరకూ ఆయన సైకిల్‌ యాత్ర చేపట్టారు. రైతుల సమస్యలపై ఫోన్‌లో మాట్లాడుదామంటే కలెక్టర్‌, ఎస్పీ, తదితర జిల్లా అధికారులు అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. ఈ మేరకు సైకిల్‌పై ఏలూరు వెళ్లి రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆక్వా వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని మండిపడ్డారు. స్పందన రాకపోవడంతో రైతుల కష్టాలను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించేందుకు సైకిల్‌పై ఏలూరు వెళ్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో మంత్రుల ప్రకటన ధరలకు.. క్షేత్రస్థాయిలో ఉన్న ధరలకు పొంతనలేదని నిమ్మల రామానాయుడు విమర్శించారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని