సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేద ప్రజలు

Updated : 08 Apr 2020 01:35 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కొనసాగుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ వారి ఆకలి తీర్చాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి బహిరంగ లేఖ రాశారు. పేదల ఆకలి కేకలు చూసే ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. 

చేయడానికి పని లేక.. తినేందుకు తిండి లేక పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి కనీసం రెండు పూటలైనా అన్నం పెట్టాలన్నారు. ప్రతి గ్రామంలోనూ తెల్లరేషన్‌ కార్డులేని కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయని.. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 12 కేజీల బియ్యంతో పాటు రూ.1500 నగదు తక్షణమే ఇవ్వాలని కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు. పేదల పరిస్థితి బయటకు వెళ్తే కరోనా భయం.. ఇంట్లో ఉంటే ఆకలి భయంలా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేయడంతో 15 రోజుల లాక్‌డౌన్‌కే ఆదాయం తగ్గిందరని ఆక్షేపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని