అంత ప్రేమ ఉంటే ఈ ఒక్కపని చేయండి:మోదీ

ప్రజలందరూ ఐదు నిమిషాలు నిలబడి తనకు వందనం చేయాలన్న వార్తలు అవాస్తవమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దురుద్దేశపూర్వకంగానే తనను వివాదంలోకి లాగేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఇది కనిపిస్తోందని పేర్కొన్నారు. కొందరి ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారేమోనని అన్నారు. ఈ మేరకు ఆయన....

Published : 09 Apr 2020 01:45 IST

తనకు గౌరవ వందనం చేయాలన్న సందేశ సృష్టికర్తలకు ప్రధాని చురకలు

దిల్లీ: ప్రజలందరూ ఐదు నిమిషాలు నిలబడి తనకు వందనం చేయాలన్న వార్తలు అవాస్తవమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దురుద్దేశపూర్వకంగానే తనను వివాదంలోకి లాగేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఇది కనిపిస్తోందని పేర్కొన్నారు. కొందరి ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారేమోనని అన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్లో హిందీలో వరుస ట్వీట్లు చేశారు.

‘మరోసారి నేను ఉద్ఘాటిస్తున్నాను. మీకు నాపై చెప్పలేనంత ప్రేముంటే, మోదీని గౌరవించాలని భావిస్తే ఒక పేద కుటుంబం బాధ్యతను తీసుకోండి. కనీసం కరోనా వైరస్‌ ముప్పు తొలిగిపోయేంత వరకైనా వారిని ఆదుకోండి. ఇంతకన్నా ఎక్కువ గౌరవం నాకొద్దు’ అని మోదీ ట్వీట్‌ చేశారు. తన కోసం ఐదు నిమిషాలు గౌరవ వందనం చేయాలని జరుగుతున్న ప్రచారాన్ని కొందరు తన దృష్టికి తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు.

‘సందేశం చూడగానే మోదీని వివాదంలోకి లాగాలన్న దురుద్దేశం కనిపిస్తోంది’ అని మోదీ రాశారు. జాతి సంక్షేమం కోసం ప్రధాని చేస్తున్న మంచిపని కోసం ఆదివారం రోజు సాయంత్రం 5 గంటలకు 5 నిమిషాలు ఆయనకు నిలబడి గౌరవ వందనం చేయాలని సోషల్‌మీడియాలో ఓ సందేశం వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని