10లక్షల మాస్కులు పంపిణీ చేస్తాం: సంజయ్‌

తెలంగాణలో లాక్‌డౌన్‌ గడువు పెంచడంతో ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి కార్యకర్త ఐదుగురికి భోజనాలు పెడుతున్నారని తెలిపారు. భాజపా  రాష్ట్ర కార్యాలయంలో మాస్క్‌ల తయారీపై...

Published : 14 Apr 2020 01:37 IST

హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ గడువు పెంచడంతో ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి కార్యకర్త ఐదుగురికి భోజనాలు పెడుతున్నారని తెలిపారు. భాజపా  రాష్ట్ర కార్యాలయంలో మాస్క్‌ల తయారీపై డెమోను సంజయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు లక్షకు తగ్గకుండా, రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మాస్కులు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. డ్వాక్రా మహిళలు, మహిళా కార్యకర్తలతో మాస్కులు తయారు చేయిస్తున్నామని చెప్పారు. యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, రక్తం అవసరం ఉన్నవారు భాజపా నేతలను, కార్యకర్తలను సంప్రదించాలని సూచించారు. భాజపా కార్యకర్తలు రక్తదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సంజయ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని