దరఖాస్తు చేస్తే 5 రోజుల్లో రేషన్‌కార్డు:బొత్స

నిత్యావసరాల కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. బియ్యం ఇచ్చే ప్రతికార్డుకూ రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

Published : 14 Apr 2020 18:48 IST

అమరావతి: నిత్యావసరాల కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. బియ్యం ఇచ్చే ప్రతికార్డుకూ రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్‌ సరకుల పంపిణీలో ఇబ్బందులను అధిగమించేలా చర్యలు చేపట్టామని బొత్స చెప్పారు.

వేసవి దృష్ట్యా అవసరమైతే రేషన్‌ దుకాణాల వద్ద టెంట్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని సీఎం జగన్‌ ఆదేశించారని చెప్పారు. అర్హులైన వాళ్లు రేషన్‌కార్డు కావాలని వస్తే వారికి 5 రోజుల్లో మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.వెయ్యి నగదు సాయం అందని వారికి త్వరగా అందజేస్తామన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని