పల్నాడులో భారీగా మద్యం: యరపతినేని

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా సీనియర్‌ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఏపీ మాజీ ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ కేంద్ర హోంశాఖకు పంపిన లేఖ తెలుగుదేశం

Updated : 16 Apr 2020 13:48 IST

అమరావతి: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా సీనియర్‌ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఏపీ మాజీ ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ కేంద్ర హోంశాఖకు పంపిన లేఖ తెలుగుదేశం పార్టీ తయారు చేసిందని విజయసాయిరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేయడం హేయమని యరపతినేని ఆరోపించారు. లేఖపై రమేశ్‌కుమార్‌ స్పష్టత ఇవ్వడంతో విజయసాయిరెడ్డి ప్రణాళిక వికటించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఏడాదిలోపే వైకాపా నిజ స్వరూపం ప్రజలు తెలుసుకున్నారని యరపతినేని అన్నారు. 

 రాష్ట్రంలో రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలకు కరోనా చికిత్సలు, పరీక్షలు సరిగా చేయకపోగా.. రాష్ట్రంలో ఉన్న వైరస్‌ తీవ్రతను తగ్గించి చూపుతున్నారని ఆరోపించారు. వారి స్వార్థం కోసం ప్రజల ప్రాణాల్ని కూడా వైకాపా ప్రభుత్వం ఫణంగా పెడుతోందని విమర్శించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం లాక్‌డౌన్‌ సమయంలోనూ అక్రమ మద్యాన్ని వైకాపా నేతలు అమ్ముతున్నారని, పల్నాడులో భారీగా మద్యం నిల్వ చేశారని యరపతినేని ఆరోపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని