
Published : 17 Apr 2020 01:27 IST
ఉపన్యాసాలు కాదు.. సరకులు ఇవ్వండి
కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్
న్యూదిల్లీ: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ స్పందించారు. ‘లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కేంద్రం కూడా ఇందుకు చొరవచూపాలి. ఈ క్రమంలో లాఠీఛార్జిలు, భాషణ్(ఉపన్యాసాలు) కాకుండా.. ప్రజలకు రేషన్(నిత్యావసరాలు), నగదు అందజేసి ఆదుకోవాల’ని గురువారం ఆయన ట్విటర్ వేదికన వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ వేళ వలస కార్మికులు, పేదల ఆకలి తీర్చుతున్న ఆలయాలు, గురుద్వారాలు, స్వచ్ఛంద సంస్థలకు సెల్యూట్ చేస్తున్నట్లు సిబల్ పేర్కొన్నారు. పేదలకు ఉచితంగా సరకులు పంపిణీ చేయాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సైతం ఇటీవల కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
Tags :