లాక్‌డౌన్‌ వేళ మధ్యప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణ

మధ్యప్రదేశ్‌లో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ఐదుగురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉండటంతో తక్కువ మందితో....... 

Published : 22 Apr 2020 00:58 IST

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ఐదుగురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉండటంతో తక్కువ మందితో ఈ కార్యక్రమం జరిగినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.  అంతకుముందు కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించడంతో బలపరీక్షలో ఓడిపోయింది. దీంతో మార్చి 23న భాజపా అభ్యర్థిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ నాలుగోసారి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన ఒక్కరే కరోనా నియంత్రణపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో అత్యవసర సమయంలో రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి లేరనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి వర్గంలో ఐదుగురికి చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో నరోత్తమ్‌ మిశ్రా, గోవింద్‌ సింగ్ రాజ్‌పుత్‌, మీనా సింగ్‌, కమల్ పటేల్‌, తులసీరామ్‌ సిలావత్‌లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని