ఖరీదైన ప్రాజెక్టులు ఆపండి, డీఏ కాదు: రాహుల్

ప్రభుత్వ ఉద్యోగులకు రాబోయే ఏడాదికి డీఏ నిలిపివేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తప్పుబట్టింది. ప్రభుత్వ మధ్య తరగతి ఉద్యోగులు, ఫించనుదారులను బాధపెట్టే బదులు కేంద్రం బుల్లెట్ రైలు, సెంట్రల్‌ విస్తా సుందరీకరణ పనులకు సంబంధించిన ప్రాజెక్టులను నిలుపుదలచేసి......

Updated : 13 May 2022 11:43 IST

దిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు రాబోయే ఏడాదికి డీఏ నిలిపివేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తప్పుబట్టింది. ప్రభుత్వ మధ్య తరగతి ఉద్యోగులు, ఫించనుదారులను బాధపెట్టే బదులు కేంద్రం బుల్లెట్ రైలు, సెంట్రల్‌ విస్తా సుందరీకరణ పనులకు సంబంధించిన ప్రాజెక్టులను నిలుపుదలచేసి డబ్బును ఆదా చేయాలని సూచించింది. ‘‘కరోనాకు వ్యతిరేకంగా దేశం కొనసాగిస్తున్న పోరులో ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, జవాన్లు, పెన్షనర్ల డీఏలో కోత విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అమానవీయం, అజ్ఞానంతో కూడుకున్నది. ఉద్యోగుల డీఏలో కోత విధించేకంటే, బుల్లెట్ రైలు, సెంట్రల్ విస్తా సుందరీకరణ పనులు వాయిదా వేయడం ద్వారా లక్షల కోట్ల డబ్బును ఆదా చేయవచ్చు’’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్రాన్ని ప్రశ్నిస్తూ హిందీలో ట్వీట్ చేశారు.

‘‘ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో  ప్రజలను ఇబ్బందిపెట్టకుండా ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అందించాలి. ప్రభుత్వం తన ఖర్చులు తగ్గించుకోకుండా మధ్య తరగతి ప్రజల డబ్బులో ఎందుకు కోత విధిస్తుంది. ప్రధాని ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల జీతాల్లో కోత విధించవద్దని చెప్తూనే, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నారు. ప్రభుత్వం తన ఖర్చుల్లో 30 శాతం తగ్గించుకోవడం ద్వారా రూ. 2.5 లక్షల కోట్లు ఆదా చేయవచ్చు’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా అన్నారు.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి 1, 2020 నుంచి జూన్‌ 30,2021 వరకు కొత్త డీఏ ఉండబోదని కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా రూ.8వేల కోట్ల ఆదా అవుతాయని అంచనా.

ఇవీ చదవండి:

కరోనా ఎన్నో పాఠాలు నేర్పింది:మోదీ

‘భారత్‌లో వైరస్‌ మరోసారి విజృంభిస్తుంది’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని