నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెరాస ఈ రోజు 20వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి

Published : 28 Apr 2020 00:44 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెరాస ఈ రోజు 20వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేశారు. అలాగే, జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నిరాడంబరంగా జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు కేటీఆర్‌, ఈటలతో పాటు కేకే తదితర ముఖ్య నేతలంతా మాస్కులు ధరించి పాల్గొన్నారు. 

2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించిన తెరాస ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో వ్యూహ ప్రతివ్యూహాలతో అనేక విజయాపజయాలు, ఒడుదొడుకులు ఎదుర్కొని దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించినా కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో నిరాడంబరంగా జరపాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలంతా ఎవరి ఇంటిపై వారు పార్టీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు. వారం రోజుల పాటు రక్తదానం చేయాలని దిశానిర్దేశం చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని