ఒక్కో కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలి: ఉత్తమ్‌

తెల్లరేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా దారిద్య్రరేఖకు దిగువున ఉన్న వారికి విపత్తు వేళ రూ.5వేల చొప్పున సాయం అందించాలని విపక్షనేతలు డిమాండ్‌ చేశారు...

Published : 01 May 2020 01:28 IST

హైదరాబాద్‌: తెల్లరేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా దారిద్య్రరేఖకు దిగువున ఉన్న వారికి విపత్తు వేళ రూ.5వేల చొప్పున సాయం అందించాలని విపక్షనేతలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ తదితరులు బీఆర్కే భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను కలిసి కరోనా సహాయక చర్యలు, ఇతర అంశాలపై చర్చించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ ప్రభుత్వం ఆదుకోవాలని సీఎస్‌కు సూచించారు.

 సీఎస్‌ సమావేశం అనంతరం విపక్ష నేతలు మాట్లాడుతూ.. ‘‘ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలంటే ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. కరోనా కట్టడికి అందరినీ కలుపుకొనిపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి. అన్ని ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలకు అవకాశం కల్పించాలి. 104, 108 సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలి. రాష్ట్రంలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు అందించాలి. కరోనా నివారణకు పీహెచ్‌సీ సిబ్బంది సేవలు వాడుకోవాలి. వైద్య సౌకర్యాల కల్పనకు మినరల్‌ ఫండ్‌ను వినియోగించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని విపక్ష నేతలు ఈ సందర్భంగా  ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని