
ఇండియా.. ఇటలీ అవ్వాలని మీ కోరికా?
సోనియా, రాహుల్‌కు ఘాటుగా బదులిచ్చిన భాజపా
దిల్లీ: శ్రామిక్ రైళ్లలో టికెట్ రుసుములో రైల్వే 85% రాయితీ ప్రకటించిందని మిగతా 15శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని భారతీయ జనతా పార్టీ తెలిపింది. వలస కూలీలు ఒక్క రూపాయి సైతం చెల్లించడం లేదని స్పష్టం చేసింది. అసలు రైల్వే కౌంటర్లలో టికెట్లే ఇవ్వడం లేదని పేర్కొంది. ప్రజలు కౌంటర్ల వద్ద గుమిగూడేలా కాంగ్రెస్ రెచ్చగొడుతోందని ఇది కరోనా వైరస్ వ్యాప్తి కారణమవుతుందని తెలిపింది. ఇటలీలో జరిగినట్టే భారత్‌లోనూ జరగాలని కోరుకుంటున్నారా అని సోనియాగాంధీని ప్రశ్నించింది.
వలస కూలీల వద్ద కేంద్ర ప్రభుత్వం టికెట్ డబ్బులు వసూలు చేస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. అందుకయ్యే ఖర్చును ఆ పార్టీ రాష్ట్ర కమిటీలు భరించాలని పిలుపునిచ్చారు. ఒకవైపు పీఎం కేర్స్‌కు రైల్వే రూ.151 కోట్లు విరాళంగా ప్రకటించి మరోవైపు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీల వద్ద టికెట్ డబ్బులు వసూలు చేస్తోందని రాహుల్ గాంధీ సైతం అన్నారు. వీరి విమర్శలకు భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, ఐటీ సెల్ బాధ్యుడు అమిత్ మాలవీయ ఘాటుగా బదులిచ్చారు.
‘రాహుల్ గాంధీజీ, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను నేను అటాచ్ చేశాను. ఏ స్టేషన్లోనూ టికెట్లు అమ్మరాదని అందులో స్పష్టంగా ఉంది. రైల్వే 85శాతం రాయితీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం 15% చెల్లించాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను చెల్లించమని చెప్పండి (మధ్యప్రదేశ్ భాజపా ప్రభుత్వం చెల్లిస్తోంది)’ అని పాత్ర ట్వీట్ చేశారు. వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం ‘శ్రామిక్ ఎక్స్‌ప్రెస్’లను నడిపిస్తోందని, ప్రతి రైలుకు సంబంధించి 1200 టికెట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తోందని వెల్లడించారు.
‘భారత్ కొవిడ్-19ను సమర్థంగా నియంత్రిస్తున్నందుకు కాంగ్రెస్ నీరసపడింది. ఇంకా ఎక్కువ మంది బాధపడాలని, చనిపోవాలని వారు కోరుకున్నారు. నియంత్రణ లేని జన సంచారంతో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఇటలీని మనం చూశాంగా. సోనియాగాంధీ ఇదే కోరుకుంటున్నారా?’ అని మాలవీయ ట్వీట్ చేశారు. ‘ఇప్పుడే పియూష్ గోయల్ కార్యాలయంతో మాట్లాడాను. కేంద్రం 85%, రాష్ట్రం 15% భరిస్తాయి. వలస కూలీలు ఉచితంగా వెళ్తారు. మంత్రిత్వశాఖ అధికార ప్రకటన చేస్తుంది’ అని అంతకుముందు భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్వీటారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Gargi: సాయి పల్లవి న్యాయపోరాటం.. ‘గార్గి’ ట్రైలర్ వచ్చేసింది!
-
General News
Andhra News: విజయవాడలో రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు... చెన్నై, విశాఖ ఎలా వెళ్లాలంటే?
-
World News
Boris Johnson: వివాదాల బోరిస్ జాన్సన్.. ‘బ్రిటన్ డొనాల్డ్ ట్రంప్’..!
-
Sports News
IND vs ENG : అలా చేయడం అద్భుతం.. విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ కోచ్ ప్రశంసల జల్లు
-
World News
Boris Johnson: ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా
-
Movies News
Tamannaah: సినీ ప్రియులకు తమన్నా ప్రామిస్.. ఎందుకంటే..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Rahul Dravid : బజ్‌బాల్ అంటే ఏమిటీ?
- అలుపు లేదు... గెలుపే!