సీఎంతో వెళ్లలేకపోయిన విజయసాయిరెడ్డి

విశాఖలో గ్యాస్‌ లీకేజీ ఘటనలో బాధితులను పరామర్శించి, పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంట వెళ్లే అవకాశం వైకాపా పార్లమెంటరీ పార్టీ

Updated : 08 May 2020 12:49 IST

ఈనాడు, అమరావతి: విశాఖలో గ్యాస్‌ లీకేజీ ఘటనలో బాధితులను పరామర్శించి, పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంట వెళ్లే అవకాశం వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి లభించలేదు. విశాఖపట్నంలో వైకాపా, ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రితో పాటు బయల్దేరేందుకు సిద్ధమైనా... ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, విశాఖ ఇన్‌ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ముఖ్యమంత్రి కార్యదర్శి, వ్యక్తిగత భద్రతాధికారి, వ్యక్తిగత కార్యదర్శి వెళ్తుండటంతో హెలికాప్టర్‌లో చోటులేక ఆగిపోయారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి ముఖ్యమంత్రి బయల్దేరుతున్నప్పుడు ఆయన వాహనంలో విజయసాయిరెడ్డి కూర్చున్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ముఖ్యమంత్రి వద్దకు వచ్చి కాసేపు మాట్లాడాక ఆయన్ను కారెక్కమని జగన్‌ సూచించారు. దీంతో వెనుక సీట్లో ఉన్న విజయసాయిరెడ్డి కారు దిగి నానికి సీటిచ్చారు. ‘తానిక్కడే ఆగిపోతా’నంటూ ముఖ్యమంత్రికి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు