సీఎం జగన్‌కు కన్నా లేఖ

విశాఖ ఘటనలో ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే

Published : 11 May 2020 15:54 IST

గుంటూరు: విశాఖ ఘటనలో ఎల్‌జీ పాలిమర్స్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని లేఖలో పేర్కొన్నారు. విషవాయువు లీకై 12 మంది మృతి చెందారని, అందులో చిన్నారులు కూడా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన గతంలో భోపాల్‌లో జరిగిన గ్యాస్‌ లీక్‌ విషాదాన్ని గుర్తుకు తెచ్చిందని లేఖలో పేర్కొన్నారు. ఘటన అనంతరం పోలీసులు, స్థానిక యువత తక్షణమే స్పందిచడంతో మరణాలు తగ్గాయని కన్నా అభిప్రాపడ్డారు. విష వాయువు పీల్చిన వారు జీవితాంతం అరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్‌ లీకేజ్‌ ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించకపోతే భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదకర సంఘటనలు పునరావృతం అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
మరోవైపు రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల శ్లాబుల్లో మార్పుపైనా ముఖ్యమంత్రికి కన్నా మరో లేఖ రాశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఆదాయం లేకుండా బిల్లులు చెల్లించటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అధిక బిల్లులు వేసి చెల్లించాలనడం అమానవీయమన్నారు. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కన్నా డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని