అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం: భట్టి

పోతిరెడ్డిపాడు విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలున్నాయని.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాజకీయ ఒప్పందం, ఆర్థిక లావాదేవీల కోసం ప్రయోజనాలను తాకట్టు

Published : 13 May 2020 01:48 IST

హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలున్నాయని.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాజకీయ ఒప్పందం, ఆర్థిక లావాదేవీల కోసం ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటూ విమర్శించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని భట్టి ప్రశ్నించారు. తెలంగాణ సాధించుకున్నదే నీళ్ల కోసమని.. అలాంటి తెలంగాణకు నీళ్లు లేకుండా తరలిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. సొంత ప్రయోజనాల  కోసం తాకట్టుపెడితే ఊరుకునేది లేదని భట్టి హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని