విద్యుత్‌ బిల్లుల పెరుగుదల అపోహే: సుచరిత

విద్యుత్‌ బిల్లుల పెరుగుదల అపోహ మాత్రమేనని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. వినియోగించుకున్న దానికి మాత్రమే బిల్లులు వస్తున్నాయని.. ..

Published : 14 May 2020 16:12 IST

గుంటూరు: విద్యుత్‌ బిల్లుల పెరుగుదల అపోహ మాత్రమేనని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. వినియోగించుకున్న దానికి మాత్రమే బిల్లులు వస్తున్నాయని.. దీనిపై ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురికావొద్దన్నారు. గుంటూరులో మీడియాతో ఆమె మాట్లాడారు. వేసవి కాలానికి తోడు లాక్‌డౌన్‌తో ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎక్కువగా వినియోగిస్తుండటం వల్లే విద్యుత్‌ బిల్లులు కాస్త ఎక్కువగా వచ్చి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. డైనమిక్‌ విధానంతో పూర్తి పారదర్శకంగా బిల్లుల వసూలు ప్రక్రియ జరుగుతోందని స్పష్టం చేశారు. నెలలో వాడిన యూనిట్లకు మాత్రమే బిల్లు వసూలు చేస్తున్నట్లు హోంమంత్రి వివరించారు. విద్యుత్‌ బిల్లులపై అపోహలు తొలగించేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రకటనలు ఇచ్చేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి..

ఆ టికెట్లన్నీ రద్దు: రైల్వేశాఖ

లాక్‌డౌన్‌ 4.0: బయట భద్రమేనా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని