ఇళ్ల స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా: తెదేపా

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతంలోని పేదలకు ఇళ్ల స్థలాల కోసం కోరుకొండలో చేపట్టిన ఆవ భూముల సేకరణ వివాదాస్పదంగా మారింది.  ఏడాదిలో..

Updated : 16 May 2020 12:28 IST

కోరుకొండ: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతంలోని పేదలకు ఇళ్ల స్థలాల కోసం కోరుకొండలో చేపట్టిన ఆవ భూముల సేకరణ వివాదాస్పదంగా మారింది.  ఏడాదిలో దాదాపు ఆరేడు నెలలు ముంపునకు గురై నీటిలోనే ఉండే ప్రాంతాలను పేదల ఇళ్ల కోసం సేకరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు శనివారం ఉదయం  తెదేపా బృందం ఈ ప్రాంతంలో పర్యటించింది.

తెదేపా నేతలు నిమ్మల రామానాయుడు, చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, జ్యోతుల నెహ్రూ, ఆదిరెడ్డి అప్పారావు తదితరులు  కోరుకొండ చేరుకుని ఆవ భూములను పరిశీలించారు. లోతట్టు ప్రాంతంలో 42వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇస్తే పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వరద ప్రభావిత ప్రాంతంలో ఇళ్లు నిర్మించడానికి అనువుకాదని ఇప్పటికే ఇరిగేషన్‌ అధికారులు స్పష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎకరం రూ.7లక్షలు ఉండే ప్రాంతంలో ఎకరం భూమి రూ.45లక్షలకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని  ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల సహకారంతో రూ.కోట్లు చేతులు మారాయని తెదేపా నేతలు ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని