దీక్షలతో ఎలాంటి ఫలితం ఉండదు: గుత్తా

నాడు పోతిరెడ్డిపాడును వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 43 వేల క్యూసెక్కులకు పెంచితే.. ఇప్పుడు ఆయన కుమారుడు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి 83వేల క్యూసెక్కులకు పెంచేందుకు యత్నిస్తున్నారని...

Published : 17 May 2020 01:03 IST

హైదరాబాద్: నాడు పోతిరెడ్డిపాడును వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 43 వేల క్యూసెక్కులకు పెంచితే.. ఇప్పుడు ఆయన కుమారుడు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి 83వేల క్యూసెక్కులకు పెంచేందుకు యత్నిస్తున్నారని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని మండలి కమిటీ హాల్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీ పునర్ విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాలేదని.. ఇప్పుడు జీవో నంబర్‌ 203ని తీసుకొచ్చారని ఆక్షేపించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ప్రాజెక్టును 80వేల క్యూసెక్కులకు తీసుకుపోనివ్వరని గుత్తా ధీమా వ్యక్తం చేశారు.

ప్రాజెక్టు పెంపుపై గతంలో అడ్డుకోని నాయకులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని గుత్తా సుఖేందర్‌ రెడ్డి మండిపడ్డారు. ఉభయ రాష్ట్రాల్లో ఉన్న రెండు జాతీయ పార్టీల నేతలు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రెండు పార్టీల నేతల అడ్డుకోవాలని.. దీక్షలతో ఎలాంటి ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తోందన్నారు. కృష్ణా జలాలపై ఏపీ అతి ఆశ సరైంది కాదని ఆయన హితవు పలికారు. పోతిరెడ్డిపాడు విషయంలో జారీ చేసిన జీవో నెంబర్‌ 203ని వెంటనే ఉపసంహరించుకోవాలని గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని