సోనియా నేతృత్వంలో ప్రతిపక్షాల సమావేశం

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోనియా గాంధీ నేతృత్వంలో శుక్రవారం ప్రతిపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది. ఈ సమావేశంలో ప్రధానంగా భాజపా ప్రభుత్వం.....

Published : 20 May 2020 01:55 IST

దిల్లీ: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ వెల్లడించింది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వలస కార్మికులు ఎదురుర్కొంటున్న సమస్యలు, కార్మిక చట్టాల్లో రాష్ట్రాలు చేస్తున్న మార్పులు, ఇటీవల కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజిపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి దేశంలోని 18 పార్టీలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. డీఎంకే నేత స్టాలిన్‌, వామపక్ష పార్టీలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశంలో పాల్గొనేందుకు అంగీకరించినట్లు కాంగ్రెస్‌ వెల్లడించింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు వాయిదా పడటంతో కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇదే తరహాలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశాలను కూడా నిర్వహించాలని కాంగ్రెస్‌ ఎంపీలు శశి థరూర్‌, ఆనంద్ శర్మ సంబంధిత అధికారులను కోరారు. మార్చి నెలలో వైరస్‌ తీవ్రతను అడ్డుకునేందుకు ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందించాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. అయితే కొద్ది వారాలుగా పలు రాష్ట్రాలు కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తుడటం, కేంద్రం ఆర్థిక ప్యాకేజిని ఆలస్యంగా ప్రకటించడంతో ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో దేశం నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని