తితిదే నిర్ణయాన్ని తప్పుబట్టిన వైకాపా ఎంపీ

నిరర్థక ఆస్తుల పేరుతో భూముల వేలం వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయాన్ని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు.....

Published : 26 May 2020 01:55 IST

అమరావతి: నిరర్ధక ఆస్తుల పేరుతో భూములను వేలం వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయాన్ని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ భూముల విరాళం ఇచ్చిన దాతల మనోభావాలను దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిచేయాల్సింది పోయి అదే తప్పు చేయాలని తితిదే భావించడాన్ని ఎంపీ తప్పుబట్టారు. ఆస్తుల అమ్మకం భగవంతుడికి తితిదే చేస్తున్న ద్రోహం అని ఎంపీ తప్పుబట్టారు. 

తితిదే భూములపై పాలకమండలి నిర్ణయం ఏమాత్రం సరికాదన్నారు. భక్తితో ఇచ్చిన భూములు విక్రయించే నిర్ణయం సరికాదన్నారు. దాతలు ఇచ్చిన ఆస్తుల పరిరక్షణకు పాలకమండలి పనిచేయాలని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ విషయాన్ని తితిదే ఆస్తుల విక్రయం విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే తితిదే వెనక్కి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని