Published : 27 May 2020 00:24 IST

మహారాష్ట్రలో ప్రభుత్వ వ్యవస్థ విఫలం: పీయూష్‌

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి రైల్వేశాఖ తక్కువ సంఖ్యలో రైళ్లను కేటాయిస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్ధవ్‌ ఠాక్రే నిందించడం దురదృష్టకరమని గోయల్‌ అన్నారు. వలస కార్మికులను తరలించేందుకు 80ప్రత్యేక రైళ్లు కావాలని కోరగా రైల్వేశాఖ కేవలం 30నుంచి 40 రైళ్లనే సమకూర్చిందని చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. రైల్వేశాఖ దాదాపు 65 రైళ్లు ఏర్పాటు చేయగా వాటిలో తరలించడానికి కార్మికులను తీసుకురావడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పీయూష్‌ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా కృషిచేయాల్సి ఉందని సూచించారు. రాష్ట్రానికి సరిపడే రైళ్లను రైల్వేశాఖ అందుబాటులో ఉంచడం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తాజాగా ట్విటర్‌లో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌  ఈ విధంగా స్పందించారు.

ఇదిలాఉంటే, మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కరోనా వైరస్‌ సంక్షోభం, లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు విషయంలో అధికారంలో ఉన్న సంకీర్ణ భాగస్వాముల మధ్య విభేదాలకు కారణమైందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌లు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన శరద్‌ పవార్‌.. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని చెప్పారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని