కమీషన్ల కోసమే ప్రాజెక్టుల ఆకృతిలో మార్పు

తెరాస నేతల జేబులు నింపేందుకే మిషన్‌ కాకతీయను చేపట్టారని మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో

Published : 28 May 2020 02:34 IST

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌

మహబూబ్‌నగర్‌: తెరాస నేతల జేబులు నింపేందుకే మిషన్‌ కాకతీయను చేపట్టారని మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్ నేతలు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం సంపత్‌ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో మన పూర్తి వాటాను తెరాస ప్రభుత్వం ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నించారు. నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను ఇన్నేళ్లుగా ఎందుకు పూర్తి చేయడంలేదని నిలదీశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా, దక్షిణ తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, అనుమతులు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం రూపకల్పన చేసిందని గుర్తు చేశారు. కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్‌ పలు ప్రాజెక్టుల ఆకృతిని మార్చారని సంపత్‌ కుమార్‌ మండిపడ్డారు. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ భారీ ఎత్తిపోతల పథకాలు చేపట్టారన్నారు. చీకటి ఒప్పందాల కారణంగానే ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టులను సీఎం కేసీఆర్‌ అడ్డుకోవడం లేదని సంపత్‌ కుమార్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని