అమరావతికి పూర్వ వైభవం: చంద్రబాబు

దేశభద్రత అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాణికైనా తెదేపా మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రెండు రోజుల మహానాడు ఇవాళ్టితో ముగిసింది. రెండు రోజుల మహానాడులో 22 తీర్మానాలను

Published : 29 May 2020 03:21 IST

ముగిసిన 2రోజుల ‘మహానాడు’

అమరావతి: దేశభద్రత అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తెదేపా మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రెండు రోజుల మహానాడు ఇవాళ్టితో ముగిసింది. రెండు రోజుల మహానాడులో 22 తీర్మానాలను ఆమోదించగా.. 52 మంది నేతలు ప్రసంగించారు. తెదేపా అధినేత చంద్రబాబు ముగింపు సందేశం ఇచ్చారు.

‘‘చైనాతో వివాదం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి తెదేపా సహకారం ఉంటుంది. సీఎం జగన్‌ చేసేది విధ్వంసకర పాలన. యువతను ప్రోత్సహిస్తా.. మహిళలకు ప్రాధాన్యమిస్తాను. పవిత్ర జలాలు, మట్టితో పునీతమైన అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. అమరావతిపై తెదేపా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అమరావతి నిర్మాణానికి రూ. లక్ష కోట్లు అవుతుందని తప్పుడు ప్రచారం చేశారు. అభివృద్ధి చేతకాక రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు అండగా ఉంటాం’’ అని చంద్రబాబు వివరించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts