మోదీ: ఆ పేరే మంత్రమూ...!

మోదీ అనే పేరే ఓ మంత్రమని... దానిలోని ఒక్కో అక్షరానికి ఓ ప్రత్యేక అర్ధం, విలువ ఉన్నాయని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు.

Published : 31 May 2020 00:53 IST

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కొత్త నిర్వచనం

దిల్లీ: మోదీ అనే పేరే ఓ మంత్రమని... దానిలోని ఒక్కో అక్షరానికి ఓ ప్రత్యేక అర్ధం, విలువ ఉన్నాయని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. నరేంద్రమోదీ మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా చౌహాన్‌ మాట్లాడుతూ... మోదీ (Modi) అనే ఆంగ్ల పదంలోని ఒక్కో అక్షరాన్ని ఈ విధంగా నిర్వచించారు...
*తొలి అక్షరం ‘ఎం’ అంటే మోటివేషనల్’ లేదా ప్రేరణ అని చౌహాన్‌ అన్నారు. దేశం ఉన్నత లక్ష్యాలను చేరేందుకు కృషిచేస్తున్న ప్రధాని మనందరికీ ప్రేరణ నిస్తారని ఆయన వివరించారు.
* ‘ఓ’ అంటే ఆపర్ట్యునిటీ లేదా అవకాశం అని... దేశ ప్రజల కోసం మోదీ దాగి ఉన్న అవకాశాలను కూడా వెలికితీస్తారని తెలిపారు.
*తరువాత వచ్చే ‘డీ’ అనే అక్షరం డైనమిక్‌ లీడర్‌షిప్ లేదా క్రియాశీలకమైన నాయకత్వాన్ని సూచిస్తుందట.
*ఇక ‘ఐ’ అనే ఆఖరి అక్షరం ‘ఇన్‌స్పైర్‌ ఇండియా’కు చిహ్నమని అంటే భారత ప్రజలు స్వావలంబన సాధించేందుకు మోదీ స్ఫూర్తినిస్తారని అయన కితాబిచ్చారు.

తమ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాసిన ఓ లేఖలో ప్రధాని మోదీ దేశప్రజలకు కృతజ్ఞతలు తెలియచేశారు. గడచిన సంవత్సర కాలంలో దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను, చర్యలను ఆయన ఆయన గుర్తుచేశారు. ‘‘ కేవలం కొనసాగింపుగా మాత్రమే కాకుండా భారత్‌ ఉన్నత శిఖరాలకు చేరేందుకు, అంతర్జాతీయంగా నాయకత్వ స్థానంలో నిలవాలనే స్వప్నాన్ని నిజం చేసుకునేందుకు భారత ప్రజలు 2019లో మమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు ఈ స్వప్నాన్ని వాస్తవరూపం దాల్చేందుకు దారితీశాయి.’’ అని నరేంద్ర మోదీ ప్రకటించారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని