వర్సిటీలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది: భట్టి

రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. భట్టి నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతల బృందం సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి

Updated : 01 Jun 2020 22:04 IST

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. భట్టి నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతల బృందం సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ... యూనివర్సిటీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు లేకుంటే పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చదువులు దక్కకుండా పోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలను రక్షించాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని భట్టి తెలిపారు. 
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ... ఉస్మానియా యూనివర్సిటీ భూముల ఆక్రమణలపై గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర పెద్దల అండతో తులసి సహకార సంఘం ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను ఆక్రమిస్తున్నారని వీహెచ్‌ ఆరోపించారు. కేంద్ర సర్వే విభాగంతో విశ్వవిద్యాలయ భూములు సర్వే చేయించాలని గవర్నర్‌ను కోరిటన్లు ఆయన వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని