తెలంగాణలో నియంత పాలన: ఉత్తమ్‌

గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జాతీయ...

Published : 02 Jun 2020 10:25 IST

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉత్తమ్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలు వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్‌, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల 60ఏళ్ల కోరికను సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ నెరవేర్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాలు జరిగాయని చెప్పిన నాయకులు ఇప్పుడు నియంత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు రావడం లేదని, తెలంగాణ వచ్చిన నాడు 12లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు 24 లక్షల నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, ఒక్క ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఆరోపించారు. లక్షకోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదన్నారు. పక్క రాష్ట్రం పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలు దోచుకుపోతుంటే పాలకులు కళ్లుమూసుకుని కూర్చుకున్నారని దుయ్యబట్టారు. 2014 నుంచి కృష్ణా ప్రాజెక్టులు పెండింగ్‌లో పెట్టారని ఉత్తమ్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని