Published : 06 Jun 2020 03:18 IST

కాలనీలు నిర్మించాలనేదే ప్రభుత్వ ఆలోచన

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లలో 30 లక్షల ప్రభుత్వ గృహాలు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. ప్రజలకు 30 లక్షల ప్లాట్లు ఇస్తుంటే ప్రతిపక్షానికి కంటగింపుగా ఉందని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా ప్రభుత్వం గత ఐదేళ్లలో 7 లక్షల ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తప్ప.. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. నాలుగు విడతలుగా గ్రామసభలు పెట్టి ప్రజల నుంచి వినతులు స్వీకరించామని.. మే నెల వరకు ప్రజల నుంచే 30 లక్షల దరఖాస్తులు వచ్చాయని బుగ్గన వివరించారు.

గృహ నిర్మాణ రంగంలో రూ.4 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని బుగ్గను తెలిపారు. ఎన్నికలకు ముందు చివరి ఏడాది ఆడంబరంగా శంకుస్థాపనలు చేశారని.. గ్రాఫిక్స్‌ ఇళ్లల్లోనే ప్రజలతో  చంద్రబాబు గృహ ప్రవేశం చేయించారని అన్నారు. ఎకరాకు రూ.40 లక్షలు చెల్లిస్తామని చెప్పినా భూమి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. అధిక ధరకు ప్రభుత్వం భూములను సేకరించినట్లు ఆరోపిస్తున్నారని.. రాజమహేంద్రవరం వద్ద ఎకరం భూమిని రూ.7 లక్షలకు చంద్రబాబు ఇప్పిస్తారా? అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం చుట్టూ కాలనీలు నిర్మించాలనేదే ప్రభుత్వ ఆలోచన అని బుగ్గన స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని