
ఉత్తరాంధ్రకు వైకాపా అన్యాయం: అయ్యన్న
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర రైతులకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెదేపా సీనియర్‌నేత సీహెచ్ అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. అనకాపల్లిలో ఉద్యానవన పరిశోధన కేంద్రాన్ని తెదేపా ప్రభుత్వం ప్రారంభిస్తే... వైకాపా ప్రభుత్వం దాన్ని పులివెందులకు తరలించిందని తెలిపారు. డాక్టర్ సుధాకర్ తనకు గతంలోనే తెలుసని, అయితే.. కొందరు ఆరోపిస్తున్నట్టుగా వ్యక్తిగతంగా ఇటీవల తనతో మాట్లాడలేదని స్పష్టం చేశారు.
వైకాపా ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, ఇక నుంచి అందరూ మాట్లాడతారన్నారు. 20శాతం పనులు పూర్తయిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని సైతం రద్దు చేశారని మండిపడ్డారు. పోలవరం పనులపై రీటెండరింగ్ అన్న ప్రభుత్వం అసలు ఆ ప్రాజెక్టు నిర్మాణపనుల్ని చేపట్టిన మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఉన్న అనుభవం ఎమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.