ప్రతిపక్షాలపై అక్రమ కేసులా?: నిమ్మల

ఎల్జీపాలిమర్స్‌ ఘటనలో బాధితుల తరఫున పోరాడిన ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు ఎందుకు బనాయిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

Updated : 09 Jun 2020 12:25 IST

ఏలూరు: ఎల్జీపాలిమర్స్‌ ఘటనలో బాధితుల తరఫున పోరాడిన ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు ఎందుకు బనాయిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్జీ పాలీమర్స్‌ బాధితుల పరిహారంపై ఎందుకు వివక్ష చూపుతున్నారని నిలదీశారు. ఇళ్ల స్థలాల ముసుగులో వైకాపా నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైకాపా భూ కుంభకోణాలను అసెంబ్లీ, శాసనమండలి వేదికగా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో ఆవ భూముల పేరుతో రూ.400 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఓవైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే .. మరో వైపు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయికూడా పేదలపై భారం మోపమని చెప్పిన జగన్‌ మోహన్‌రెడ్డి రెండు సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారని విమర్శించారు. లాక్‌ డౌన్‌ సమయంలో విద్యుత్‌ ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలని రామానాయుడు డిమాండ్‌ చేశారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని