అచ్చెన్న అరెస్టుపై న్యాయపోరాటం

టీడీఎల్పీ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని  నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారని శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్‌నాయుడు మండిపడ్డారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన

Updated : 12 Jun 2020 19:31 IST

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం: టీడీఎల్పీ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని  నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారని శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్‌నాయుడు మండిపడ్డారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏశాఖలోనైనా అవినీతి జరిగితే నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాతే చర్యలుంటాయి. కానీ, ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని రామ్మోహన్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

‘‘ ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదా? ప్రజల మద్దతున్న నాయకుడిపై కక్ష సాధిస్తున్నారు. నవరత్నాలు అంటూ ప్రజలకు ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నా సక్రమంగా అమలు చేశారా? ఏడాది పాటు ఫ్యాక్షన్‌ రాజకీయాలు తప్ప చేసిందేమీ లేదు. మా కుటుంబం మొత్తం నీతికి, నిజాయితీకి కట్టుబడి సేవలందింస్తోంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అసలు నిజమేంటో బయటికొస్తుంది. ఎన్నో పథకాలను తెదేపా ప్రారంభించిందనే కారణంతో ఆపేశారు. ప్రతిపక్షమే లేకుండా చేయాలని ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు. ఎల్జీ పాలీమర్స్‌ ఘటన జరిగితే స్థానికులను రోడ్లపై పడేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని నిలబడింది. తెదేపా అధినేత చంద్రబాబు సహకారంతో  వైకాపా అరాచకాలను ఎదుర్కొంటాం’’ అని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని