బురద జల్లేందుకే ఇలాంటి అరెస్టులు:చంద్రబాబు

గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడిని కలిసేందుకు

Published : 14 Jun 2020 00:51 IST

గుంటూరు: గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడిని కలిసేందుకు మేజిస్ట్రేట్‌ అనుమతి కావాలని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ చెప్పడంతో చంద్రబాబు ఆస్పత్రి బయటే ఉండిపోయారు. అనుమతి రాకపోవడంతో బయటనుంచే ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జీజీహెచ్‌ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అచ్చెన్నను ఉన్నపళంగా ఇంటినుంచి తీసుకొచ్చారు. ఆయనకు ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. నిన్న పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత దారుణం. తప్పుడు రికార్డులు సృష్టించి అరెస్టు చేశారు. 35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కుటుంబం ఆయనది. పేరున్న కుటుంబంపై బురద జల్లేందుకే ఇలాంటి అరెస్టులు చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గాలు సమాజానికి మంచివి కాదు. వైకాపా అవినీతిపై శాసనసభలో నిలదీస్తామనే ఇలాంటివి చేస్తున్నారు. ఇవాళ జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ప్రలోభాలు పెట్టి మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లాక్కున్నారు. అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేయడం అధికార దుర్వినియోగమే అవుతుంది’’ అని చంద్రబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని