‘పది’ పరీక్షలు రద్దు చేయాలి: చంద్రబాబు

కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతిపరీక్షలు రద్దు చేయాల్సిన అవసరం ఉందని తెదేపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేతచంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా పదోతరగతి పరీక్షలు

Updated : 16 Jun 2020 18:33 IST

అమరావతి: కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాల్సిన అవసరం ఉందని తెదేపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేతచంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా పదో తరగతి పరీక్షలు పెట్టలేదని గుర్తుచేశారు. తల్లిదండ్రులు, పిల్లల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలు రద్దు చేయాలన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో దీనిపై చంద్రబాబు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనా నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా దృష్టిపెట్టలేదు. సీఎం నుంచి ఎవరూ మాస్కులు పెట్టుకోవాలనే ఆలోచన లేకుండా ప్రవర్తించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా రెండో బడ్జెట్‌ ఉంది. ఈ సభ ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చారు. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు కరోనాను పూర్తిగా విస్మరించి ప్రవర్తించారు’’ అని మండిపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని