ఎలాంటి విచారణకైనా సిద్ధమే: పితాని

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. మంచి పరిపాలన అందించాలని ప్రజలు అధికారం కట్టబెడితే వైఎస్‌ జగన్‌ ....

Published : 19 Jun 2020 01:24 IST

రాజమహేంద్రవరం: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. మంచి పరిపాలన అందించాలని ప్రజలు అధికారం కట్టబెడితే వైఎస్‌ జగన్‌ సర్కారు  ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్‌ఐలో ఎలాంటి అవకతవకలూ జరగలేదని చెప్పారు. వైకాపాలో చేరలేదనే తనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తాను విదేశాలకు, రహస్య స్థావరాలకు పారిపోయాననే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని ఇంటి వద్దనే ఉన్నానని పితాని పేర్కొన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి వ్యవహారంలో పోలీసులు భయాందోళనలు రేకెత్తించారని పితాని అన్నారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైకాపాలో చేరిన వెంటనే మైనింగ్‌ అనుమతులు ఇచ్చేశారని అన్నారు. ఈ వ్యవహారంలో వైకాపా ప్రభుత్వం నీతి అర్థమవుతోందని దుయ్యబట్టారు. బీసీలను హేళన చేసి మాట్లాడటం మంత్రులకు సరికాదని పితాని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని