జన్మదిన సంబరాలకు రాహుల్ గాంధీ దూరం..

కరోనా మహమ్మారి వ్యాప్తి, ఇరవై మంది సైనిక సోదరుల మృతికి సంతాపంగా... జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిర్ణయించుకున్నారు.

Published : 19 Jun 2020 12:26 IST

దిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి, గల్వాన్‌ లోయలో ఇరవై మంది సైనిక సోదరుల మృతికి సంతాపంగా... జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిర్ణయించుకున్నారు. కాగా, నేడు అయన 50వ పుట్టిన రోజు సందర్భంగా.. ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లో కూడా సంబరాలు జరపరాదని ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. అందుకు బదులుగా అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలని ఏఐసీసీ అధిష్టానం సూచించినట్టు సమాచారం. అంతేకాకుండా పేదలకు, నిస్సహాయులకు ఆహారం, నిత్యావసరాల కిట్లు అందిచాల్సిందిగా వారు తెలిపారు. రాహుల్‌ పుట్టినరోజు సందర్భంగా పార్టీ యువజన విభాగం దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు  వెల్లడైంది. ఈ మేరకు.. యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు దేశవ్యాప్తంగా కరోనా కిట్లను అందచేయనున్నారు. అంతేకాకుండా, పేదలు, వలస కార్మికులకు ప్రయోజనం కలిగేలా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని