‘మంత్రులు దురుద్దేశంతో వ్యవహరించారు’

మంత్రులు ఏపీ శాసనమండలిలో దురుద్దేశంతో వ్యవహరించారని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. ..

Published : 20 Jun 2020 01:39 IST

తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల

అమరావతి: మంత్రులు ఏపీ శాసనమండలిలో దురుద్దేశంతో వ్యవహరించారని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సబ్జెక్టుతో సంబంధంలేని 16 మంది మంత్రులు శాసనమండలిలోకి వెళ్లి ప్రతిపక్ష సభ్యులపై దౌర్జన్యం చేశారని విమర్శించారు.

‘‘లోకేశ్‌బాబు ఆయన స్థానంలో కూర్చుని ఉంటే.. ప్రతిపక్ష సభ్యుల సీట్ల వద్దకు మంత్రులు ఎందుకు వెళ్లారు? శాసనమండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారం ఎందుకు నిలిపివేశారు? మహిళలు ఉన్నారని కూడా చూడకుండా అసభ్యంగా ఎందుకు మాట్లాడారు? మీరు దురుద్దేశంతో వ్యవహరించారని చెప్పడానికి ఇది చాలు’’ అని రవీంద్రకుమార్‌ అన్నారు. తెలుగుదేశం సభ్యులపై దుర్భాషలాడి ..వాళ్లపైనే ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని