ఇక‌నైనా.. సైన్యాన్ని అవ‌మానించ‌కండి ప్లీజ్‌!

 సైనిక బ‌ల‌గాల‌ను కాంగ్రెస్ పార్టీ కించ‌ప‌ర‌చ‌డం మానుకోవాల‌ని భాజ‌పా అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా అన్నారు. వారి శౌర్యాన్ని ప‌దేప‌దే ప్ర‌శ్నించ‌కూడ‌ద‌ని మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ను విమ‌ర్శించారు....

Published : 23 Jun 2020 01:04 IST

కాంగ్రెస్‌, మ‌న్మోహ‌న్‌పై జేపీ న‌డ్డా తీవ్ర విమ‌ర్శ‌లు

ముంబ‌యి: సైనిక బ‌ల‌గాల‌ను కాంగ్రెస్ పార్టీ కించ‌ప‌ర‌చ‌డం మానుకోవాల‌ని భాజ‌పా జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా అన్నారు. వారి శౌర్యాన్ని ప‌దేప‌దే ప్ర‌శ్నించ‌కూడ‌ద‌ని మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ను విమ‌ర్శించారు. గ‌ల్వాన్ లోయ‌లో చైనాతో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌రులైన సంగ‌తి తెలిసిందే. స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితుల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ గ‌త‌వారం అఖిల‌ప‌క్ష స‌మావేశంలో వివ‌రించారు. భార‌త భూభాగం చొర‌బాటుకు గురికాలేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్య‌క్తం చేసింది. అవాస్త‌వాలు చెబుతున్నార‌ని విమ‌ర్శించింది.

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ సైతం సోమ‌వారం ఉద‌యం మోదీపై విమ‌ర్శ‌లు చేశారు. ఆచితూచి మాట్లాడాల‌ని సూచించారు. ఈ నేప‌థ్యంలో న‌డ్డా ఓ ట్వీట్ చేశారు. ‘ప‌దేప‌దే మ‌న సైనిక బ‌ల‌గాల‌ను కించ‌ప‌ర‌చ‌డం ద‌య‌చేసి ఆపేయండి. వారి శౌర్యాన్ని ప్ర‌శ్నించ‌కండి. ఎయిర్ స్ట్రైక్స్‌, స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్  త‌ర్వాతా మీరు ఇలాగే చేశారు. క‌నీసం ఇలాంటి సంద‌ర్భాల్లోనైనా  జాతి ఐక్య‌తకు నిజ‌మైన అర్థం తెలుసుకోండి. ఇప్ప‌టికైనా మారితే మంచిది’ అని న‌డ్డా ట్వీట్ చేశారు.

త‌న హ‌యాంలో జ‌రిగిన చొర‌బాట్ల గురించి మ‌న్మోహ‌న్‌సింగ్ క‌నీసం విచారించ‌లేద‌ని న‌డ్డా అన్నారు.  వంద‌ల కిలోమీట‌ర్ల భూమిని డ్రాగ‌న్‌కు ఆయ‌న‌ స‌రెండ‌ర్ చేశార‌ని తీవ్రంగా విమ‌ర్శించారు. 2010 నుంచి 2013 వ‌ర‌కు 600 క‌న్నా ఎక్కువ సార్లు చైనా చొర‌బాట్ల‌కు పాల్ప‌డింద‌ని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని