ఒక చిత్రం, ఒక ప్రశ్న: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఇటీవలి ఇండో-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

Published : 24 Jun 2020 01:29 IST

చైనా ఆక్రమణ జరిగిందా? అంటూ సూటి ప్రశ్న

దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఇటీవల లద్దాఖ్‌ వద్ద చోటుచేసుకున్న ఇండో-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ చిత్రాన్ని సామాజిక మాధ్యమ ఖాతాలో ఉంచారు. తన తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ తీసిన నాటి అందమైన ‘ప్యాంగాంగ్‌ సో’ సరస్సు చిత్రాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా... ‘‘చైనా ఆక్రమణకు వ్యతిరేకంగా మనందరం ఏకమయ్యాము. చైనా మన భూమిని ఆక్రమించిందా?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు.

 మే 5 నుంచి లద్దాఖ్‌ సమీపంలో భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతమైన ‘ప్యాంగాంగ్‌ సో’ వద్దనే భారత్‌తో చైనా ఘర్షణలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అనంతరం అవి జూన్‌ 15న తీవ్రరూపం దాల్చటంతో గల్వాన్‌ లోయ వద్ద 20 మంది భారత సైనికులు, సుమారు 40 మందికి పైగా చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా, వాస్తవాధీన రేఖ వద్ద హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న ఇంత ఉద్రిక్త పరిస్థితిలో కూడా... భారత ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు  చైనా ప్రశంసిస్తోంది? అని రాహుల్‌ గాంధీ గతంలో సందేహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నరేంద్ర మోదీ ‘‘సరెండర్‌ మోదీ’’ అని ఆయన ఎద్దేవా చేశారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు