ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేలా... 

జులై 8న ఉచిత ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలను పంపిణీకి సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ 

Published : 24 Jun 2020 01:34 IST

త్వరలో ఉత్తర్వులు ఇస్తామన్న ఏపీ సీఎం

అమరావతి: జులై 8న ఉచిత ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలను పంపిణీకి సిద్ధంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘స్పందన’పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 29 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని జగన్‌ తెలిపారు. 

‘‘ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ పూర్తి చేయాలి. కొవిడ్‌-19 తగ్గుముఖం పట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పర్యటిస్తా. రీచ్‌లు మునిగిపోకముందే 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను నిల్వ చేయాలి. ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేలా అనుమతికి త్వరలోనే ఉత్తర్వులు ఇస్తాం. ట్రాక్టర్లకు సంబంధించిన అంశంపైనా త్వరలోనే ఉత్తర్వులు వస్తాయి’’ అని సీఎం జగన్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని