‘ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఉందా?’

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలను ఆషామాషీగా చేస్తున్నారా అనే అనుమానం వస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా....

Published : 25 Jun 2020 02:37 IST

ట్విటర్‌లో నారా లోకేశ్‌ ప్రశ్న

అమరావతి‌: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలను ఆషామాషీగా చేస్తున్నారా అనే అనుమానం వస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా పరీక్షల్లో నిర్లక్ష్యం తగదని లోకేశ్‌ హితవు పలికారు. ‘‘ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, క్వారంటైన్‌కు రమ్మని హడావుడి చేశారు. అదే హైదరాబాద్‌లో రెండుసార్లు పరీక్ష చేసుకుంటే నెగిటివ్‌ వచ్చింది. ఒక ఎమ్మెల్సీ విషయంలోనే ఇలా ఆటలాడితే, ప్రజలతో ఇంకెన్ని ఆటలు ఆడుతున్నారు? ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా పరీక్షల్లో ఏమిటీ నిర్లక్ష్యం?’’ అని లోకేశ్‌ ప్రశ్నించారు. 

‘‘పాజిటివ్ అని నిర్ధరణ చేసుకోకుండా దీపక్ రెడ్డిని క్వారంటైన్ లో పెట్టడానికి చేసిన హడావిడి చూస్తే.. ప్రభుత్వం ఇంకేదైనా కుట్ర చేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా కరోనా పరీక్షల విశ్వసనీయత తేలాల్సిందే’’ అని నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో పాటు దీపక్‌ రెడ్డి పరీక్ష ఫలితాలను ట్వీట్‌లో జోడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని