Published : 27/06/2020 13:55 IST

కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ఇంటికి ఈడీ బృందం

దిల్లీ: ముగ్గురు సభ్యులున్న ఈడీ దర్యాప్తు బృందం ఈ ఉదయం దిల్లీలోని సీనియర్ కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ నివాసానికి చేరుకుంది. వేలకోట్ల రూపాయల విలువైన సందేశారా సోదరుల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయనను ప్రశ్నించనున్నామని అధికారులు తెలిపారు. కాగా, మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం క్రింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నమని వారు వివరించారు.

ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అహ్మద్‌ పటేల్‌కు గతంలో రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే వయోవృద్ధులు తమ ఇళ్లకే పరిమితం కావాలన్న కొవిడ్‌-19 వ్యాప్తి మార్గదర్శకాల అనుసారం.. తాను హాజరు కాలేనంటూ అహ్మద్‌ పటేల్‌ తన అశక్తత వెలిబుచ్చారు. ఆయన విజ్ఞప్తిని అమోదించిన ఈడీ, దర్యాప్తు బృందాన్ని మధ్య దిల్లీలోని మదర్‌ థెరిసా క్రిసెంట్‌ వద్దనున్న ఆయన ఇంటికే పంపేందుకు అంగీకరించింది.

గుజరాత్‌కు చెందిన స్టెర్టింగ్‌ బయోటెక్‌ సంస్థ, ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణాలను పొందింది. అనంతరం చెల్లింపులు లేకపోవటంతో దీనిని నిరర్ధక ఆస్తిగా ప్రకటించారు. కాగా, ఈ రుణం విలువ ప్రస్తుతం రూ.8,100 కోట్లకు చేరినట్టు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో సంస్థ యజమానులైన చేతన్ సందేశారా‌, నితిన్‌ సందేశారా సోదరులతో సహా మరికొందరికి భాగస్వామ్యముందని అనుమానిస్తున్నారు. ఈ కేసుపై సీబీఏ అక్టోబర్‌ 2017లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నీరవ్‌ మోదీకి సంబంధమున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంబకోణం కంటే సందేసారా సోదరుల కుంబకోణం మరింత పెద్దదని ఈడీ గతంలో ప్రకటించింది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని